BIG BREAKING: విశ్వవిజేత ఆస్ట్రేలియాపై ఆఫ్ఘన్ ఓపెనర్ సెంచరీ…!

-

ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ రసవత్తరమైన మలుపు తిరిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ కు ముందుగా ఆఫ్గనిస్తాన్ ఆస్ట్రేలియా తో తలపడుతోంది అంటే చిత్తు చిత్తు గా ఓడిపోతుంది అని అంతా అనుకున్నారు.. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే 200 లోపు ఆల్ అవుట్ అయిపోతుంది అని ఊహించారు. కానీ పసికూన ఆఫ్గనిస్తాన్ చెలరేగి ఆడుతోంది.. ఈ మ్యాచ్ లో ఊహించదానికంటే మిన్నగా రాణిస్తూ ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టోటల్ ను ఉంచేలా ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జాడ్రాన్ ఆస్ట్రేలియా పై సెంచరీ సాధించాడు.. ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని నిలబడడమే గొప్ప అలాంటిది చాలా సంయమనంతో ఆడి సెంచరీ చేయడమంటే మాములు విషయం కాదు.

వరల్డ్ కప్ లో ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్మన్ కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం మరియు ఆస్ట్రేలియా మీద సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. అత్యధిక సార్లు ప్రపంచ కప్ ను అందుకున్న విశ్వవిజేత ఆస్ట్రేలియా పై సెంచరీ చేసి ఖ్యాతిని గడించాడు ఇబ్రహీం.

Read more RELATED
Recommended to you

Latest news