BREAKING : అండర్-19 ఆసియా కప్ షెడ్యూల్ విడుదల…!

-

వరల్డ్ కప్ ఇంకా జరుగుతుండగానే క్రికెట్ లో మరో టోర్నమెంట్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అండర్ 19 స్థాయిలో ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 8వ తేదీన స్టార్ట్ కానుండగా 17వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆడనున్న ఈ టోర్నీలో గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, నేపాల్ లు ఉండగా, గ్రూప్ బి లో బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, జపాన్ లు ఉన్నాయి. ఇక టోర్నమెంట్ ఏది అయినా, స్థాయి ఏదైనా దాయాదులుగా ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్ ల మ్యాచ్ గురించి అందరూ ఎదురుచూస్తుంటారు.

ఆ విధంగా ఇండియా మరియు పాకిస్తాన్ లు డిసెంబర్ 10న తలపడనున్నాయి. కాగా ఇప్పటికే ముగిసిన సీనియర్ మెన్ ఆసియా కప్ లో ఇండియా ఫైనల్ లో శ్రీలంక ను చిత్తు చిత్తు గా ఓడించి కప్ ను కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news