ఎన్నో అంచనాలతో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ దసరాకు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు బయోపిక్, కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్ క్లిక్ అవుతుంది అంతా అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. థియేటర్ లలో సినిమా చూసిన ఏ ఒక్కరూ సంతోషంగా బయటకు రాలేదంటే నమ్మండి. ప్రయత్నం మంచిదే అయినా సక్సెస్ కావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎలాగు కొద్దీ నష్టాలతో టైగర్ నాగేశ్వరరావు బయట పడినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరావు ఈ నెలలోనూ ఒటిటి లోకి రానుందట. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను అమెజాన్ ప్రైమ్ కు రూ. 15 కోట్లకు అమ్మినట్లు సమాచారం.
అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.