ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉంది, ఎంతో కొంత సంక్షేమ పథకాల పేరిట ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకో అయిదు నెలలే సమయం ఉన్నందున వైసీపీ నేతలు ప్రజలు దగ్గరకి వెళ్లి మేమేమి చేశామో చెబుతూ ఓట్లు మాకే వెయ్యాలని కార్యక్రమాన్ని చేస్తున్నారు. “వై ఏపీ నీడ్స్ జగన్?” కార్యక్రమంలో భాగంగా తాజాగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో మాట్లాడుతూ.. సీఎం జగన్ కులం, మతం., ప్రాంతం అన్న తేడాలు ఏమీ చూపించకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తూ మంచి పాలనను చేస్తున్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా లాంటి కష్టమైన సమయంలోనూ సీఎం జగన్ వెనక్కి తగ్గకుండా చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వచ్చాడు… ఇలాంటి కారణాలు వలనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా జగనే రావాలి అంటూ మాట్లాడారు కారుమూరి నాగేశ్వరావు.
అందుకే అందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలంటూ కారుమూరి మాట్లాడారు, ఒకవేళ టీడీపీకి ఓటేశారా జన్మభూమి కమిటీలు వచ్చి మీకు వచ్చే ఏ రూపాయిని వదలకుండా దోచుకుతింటారంటూ చెప్పారు.