రాజేంద్రనగర్‌ భారీ అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సన్​సిటీలోని ఓ టపాసుల దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ షాపులోని మంటలు పక్కనే ఉన్న ఫుడ్ జోన్​లోకి వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ పేలి ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు ఐదు దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్‌ దుకాణం వద్ద సంచరించినట్లు పోలీసీలు సీసీ కెమెరాలో గుర్తించారు. అయితే ఆ వ్యక్తే దుకాణానికి నిప్పు పెట్టాడా లేదా ప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడిని పట్టుకుని విచారిస్తే ఈ ఘటన ప్రమాదమా లేక కావాలని చేసిందా అనే విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news