తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్?

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నారు. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు భార్య పల్లవి వర్మతో కలిసి అతను వెళ్లగా, ఆమె బేబీ బంప్ తో కనిపించారు. ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నారు. ఇది అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

nikhil-going-to-be-a-father

ఇది ఇలా ఉండగా.. మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కానీ కార్తికేయ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా నిఖిల్ స్వయంభు అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగే కథాంశం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news