కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు సంబంధించి హిజాబ్ సమస్య ప్రధానంగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు హిజాబ్ ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 18, 19వ తేదీలలో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నిర్వహించనున్న నేపథ్యంలో, రిక్రూట్మెంట్ పరీక్షల సమయంలో తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా ముసుగు ధరించి వచ్చేవారిని ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా…. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. విద్యార్థుల, నిరుద్యోగులకు సంబంధించి పరీక్షలు అత్యంత కీలకమని, ఎవరు రాస్తున్నారనేది అత్యంత ముఖ్యమైన విషయం అని పేర్కొన్నారు. తాము తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చని, కానీ సహకరించక తప్పదని స్పష్టంచేశారు సీఎం సిద్ధరామయ్య.