2024లో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే – సీఎం కేసీఆర్

-

2024లో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిన్న జరిగి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రాబోయే రోజులలో ప్రాంతీయ పార్టీవేదే హవా అవుతుందని… 2024 సంవత్సరంలో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Victory is ours again said CM KCR

దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు చాలా కీలకము కాబోతున్నాయని ఆయన వివరించారు. ఇలాంటి సమయంలో పార్లమెంటు స్థానాలు మనం ఎక్కువగా గెలిస్తే… కేంద్రంలో మన తడాఖా చూపిస్తామని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కాబట్టి తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీ వైపు ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచించిందా ? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని… మట్టి కల్పించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని… ధరణి పోర్టల్ తీసేస్తే రైతుబంధు డబ్బులు రైతులకు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news