ఐటీ రైడ్స్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు – నల్లమోతు భాస్కరరావు

-

ఐటీ రైడ్స్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు. బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పలు చోట్లు ఐటీ దాడులు జరుగుతున్నాయి.

BRS MLA Nallamothu Bhaskar Rao comments on it raids
BRS MLA Nallamothu Bhaskar Rao comments on it raids

మిర్యాలగూడ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో 40 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నల్గొండలోనే 30 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అయితే.. ఐటీ రైడ్స్‌ పై మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు స్పందించారు. వ్యాపారులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.. ఐటీ రైడ్స్‌ ఎదుర్కొంటున్న వాళ్లతో నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్నారు మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు. కొత్త మంది కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని.. అక్రమ సంపాదన ఉంటే.. ఐటీ అధికారులకే ఇస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news