AUS VS SA : ఆ ఒక్కడొచ్చాడు వరుస బంతుల్లో 2 వికెట్లు తీశాడు !

-

కోల్కతా లో జరుగుతున్న రెండవ సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా కు కీలక మ్యాచ్ లో టాప్ 4 బ్యాట్స్మన్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా పరుగుకు పరుగు జత చేస్తూ మిల్లర్ మరియు క్లాజెన్ లు ఆడుతూ వచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా వీరిని అవుట్ చేయడంలో విఫలం అయ్యారు.. అప్పుడే కమిన్స్ కు ఒక ఐడియా వచ్చింది.. వెంటనే పార్ట్ టైం స్పిన్ బౌలర్ హెడ్ ను బరిలోకి దించాడు. 31 వ ఓవర్ వేసిన హెడ్ నాలుగు మరియు అయిదు బంతుల్లో ప్రమాదకర క్లాజెన్ (47) మరియు మార్కో జాన్సన్ (0) ను అవుట్ చేసి ఆస్ట్రేలియా శిభిరంలో సంతోషాన్ని డబుల్ చేశాడు. హెడ్ రాకతో వీరిద్దరూ కలిసి అయిదవ వికెట్ కు నమోదు చేసిన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఎవ్వరూ ఊహించలేదు ఇలా జరుగుతుంది అని, కానీ ఆ ఒక్కడే వచ్చాడు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ను పాతాళంలోకి నెట్టేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అన్నది సందేహమే.

Read more RELATED
Recommended to you

Latest news