సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది అనుకుంటే, ఫస్ట్ హాఫ్ లో ఏమంత మజా లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మెరుపులు ఏమీ లేకుండానే ఇన్నింగ్స్ ను ముగించింది. ఒక దశలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా, మిల్లర్ మరియు క్లాజెన్ లు ఆదుకున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఒక వైపు వికెట్లు పడుతున్నా అందరి సహాయంతో నిదానంగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సౌత్ ఆఫ్రికా కు పరువు పోకుండా ఒక మాదిరి స్కోర్ వచ్చేలా చేశాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో బంతుల్లో 8 ఫోర్లు మరియు 5 సిక్సులతో 101 సెంచరీ సాధించి వెంటనే కమిన్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు, లేకుంటే మరో పరుగులు సులభంగా వచ్చేవి.
జట్టుకు భారీ స్కోర్ సాధించాల్సిన బాధ్యత ఉన్న డికాక్ , బావుమా, డస్సెన్, మార్ క్రామ్ లు ఫెయిల్ అయ్యారు. క్లాజెన్ (47) ఒక్కడే మిల్లర్ కు కొంతమేరకు సహకరించి ఈ మాత్రం స్కోర్ అయినా జట్టుకు వచ్చేలా చేశాడు.