సౌత్ ఆఫ్రికా 212 ఆల్ అవుట్… “కంగారూల పని సులభమయ్యేనా” ?

-

ఎన్నో ఆశలతో ఇండియాలో అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు తీరా కీలక మ్యాచ్ లో అంచనాలను తగినల్టు రాణించలేక సెమీఫైనల్ 2 లో ఆస్ట్రేలియా తో స్వల్ప స్కోర్ తో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్లు స్టార్క్ మరియు హాజిల్ వుడ్ ల దెబ్బకు 4 కీలక వికెట్లు కోల్పోయి 100 లోపే ఆల్ అవుట్ అయ్యేలా కనిపించింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను రిపేర్ చేసే బాధ్యతను మిల్లర్ మరియు క్లాజెన్ లు తీసుకున్నారు, ఐదవ వికెట్ కు 95 పరుగులు జోడించిన పరిస్థితి ఏమీ మారలేదు. మిల్లర్ (101) ఒక్కడే ఒంటి చేత్తో సాహసం చేయగా చివరికి సౌత్ ఆఫ్రికా 212 పరుగుల వద్ద ఉండగా ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మరియు కమిన్స్ లు చెరో మూడు వికెట్లు తీయగా, హాజిల్ వుడ్ మరియు హెడ్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్ కు చేరుకోవాలంటే 213 పరుగులు చేయాల్సి ఉంది. మరి సౌత్ ఆఫ్రికాకు ఉన్న బౌలింగ్ లైన్ అప్ తో కంగారూలను భయపెడతారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news