సెమీస్ లో ఓడిన NZ, SA లకు ప్రైజ్ మనీ ఎంతంటే?

-

వరల్డ్ కప్ లో పాల్గొన్న పది జట్లలో కేవలం నాలుగు మాత్రమే సెమీస్ కు చేరుకొని అందరి దృష్టికి ఆకర్శించాయి. కాగా నిన్న మొన్న జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లలో ఇండియా పై కివీస్ ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించగా, గత రాత్రి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పై ఓటమి పాలయ్యి ఇంటి బాట పట్టింది. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్లకు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది అన్న ప్రశ్నకు సమాధానంగా, సెమీస్ కు చేరినందుకు న్యూజిలాండ్ కు 8 లక్షల డాలర్లు మరియు లీగ్ లో 5 మ్యాచ్ లు గెలిచినందుకు 2 లక్షల డాలర్లు గెలుచుకుందు. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే.. సెమీస్ కు చేరుకున్నందుకు 8 లక్షల డాలర్లు మరియు లీగ్ దశలో 7 మ్యాచ్ లు గెలిచినందుకు 2 .80 లక్షల డాలర్లు గెలుచుకుంది.

అయిన ప్రైజ్ మనీ కన్నా కూడా ఫైనల్ చేరుంటే బాగుండేదని ఈ దేశం అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు దేశాలు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో కప్ ను గెలుచుకున్నది లేదు.

Read more RELATED
Recommended to you

Latest news