చేర్యాల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జనగాం నియోజకవర్గంలోని చేర్యాల సభలో ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకొని తిరిగాడు.. అందుకే ఆయనను రైఫిల్ రెడ్డి అంటున్నారు. వాళ్ల పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అంటున్నారని రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఆంద్రోళ్ల చెప్పులు మోశాడని తెలిపారు. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రైతుబంధు వృధా అంటుండు.. రేవంత్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటున్నాడు.
భట్టి విక్రమార్క ధరణీని బంగాళఖాతంలో వేయాలంటున్నాడు. ధరణీ తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2వేలు పెన్షన్ ఇస్తే ముక్కు నేలకు రాస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధరణీలో ఏమైనా సమస్యలుంటే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వచ్చి రూ.4వేలు పెన్షన్ ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రజలను అడిగారు కేసీఆర్.