హైదరాబాద్ లో భారీగా డబ్బు పట్టివేత..!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళలో భారీగా డబ్బు పట్టుబడింది. నవంబర్ 30న జరిగే ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అక్కడక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలలో ఇప్పటికే రూ.570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం అప్పా జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీలలో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు 6 కార్లలో తరలిస్తున్న రూ.6.5కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు అంతా ఓ కాంగ్రెస్ కీలక ముఖ్య నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే తరిలిస్తున్నారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి కార్లనూ సీజ్ చేశారు. అయితే అక్టోబర్ 09వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో నగదును ఎక్కువగా ఆధారాలు లేకుండా ప్రజలు బయటికీ తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news