వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు పెద్ద షాక్. స్వల్ప వ్యవధిలోనే ముగ్గురు కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఆది నుంచి తడబడుతున్న ఓపెనర్ శుభ్మన్ గిల్(4) స్టార్క్ బౌలింగ్లో ఆడం జంపాకు తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ(47) ధాటిగా ఆడే క్రమంలో మాక్స్వెల్ బౌలింగ్లో హెడ్ చేతికి చిక్కాడు. ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్(4)ను కమిన్స్ వెనక్కి పంపాడు. దాంతో, 81 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్ నెమ్మదిగా ఉడుతున్నారు. 27.2 ఓవర్లకు భారత్ 143 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 52 పరుగులు చేశాడు. కే.ఎల్.రాహుల్ 65 బంతుల్లో 35 పరుగులు సాధించి వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే ఇండియా కప్ కొట్టాలనే కసితో ఉన్నప్పటికీ.. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్నారు. చివరికీ వరల్డ్ కప్ ఎవరినీ వరించనుందో మరికొద్ది సేపట్లోనే తేలనుంది.