వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని మృతి చెందాడు. తిరుపతి మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ టీమిండియా ఓటమి అనంతరం, రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ చలించిపోయారు. ఆకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు వెంటనే అతడిని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించగా…. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అటు ఆస్ట్రేలియా టీంకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వన్డే ప్రపంచకప్ లో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ టోర్నీలో బాగా ఆడారు. అద్భుత విజయంతో ముగించారు. సెంచరీతో రాణించిన ట్రావిస్ హెడ్ కు ప్రత్యేక అభినందనలు’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ మెగా టోర్నీలో టీమిండియా ప్రతిభ, సంకల్పం చెప్పుకోదగినదని కొనియాడారు. మీ పోరాట స్ఫూర్తిపై గర్వంగా ఉందని…. మేమంతా మీ వెంటే ఉంటామని తెలిపారు.