మేఘా కంపెనీకి రూ.2000 కోట్లు అప్పు…మంత్రి బుగ్గన క్లారిటీ

-

మెగా సంస్థపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని ఆరోపించారు…గ్యారంటీ లెటర్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. ఫ్రెషర్స్ ని ఆర్థిక పరమైన అంశాల గురించి ముందు తెలుసుకోవాలి…బ్యాంక్ లు మెగా సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని చెప్పారు. మెగా సంస్థకు ఎన్ని బకాయిలు ఉన్నాయి అని వివరాలు మాత్రమే బ్యాంకులకు ఇచ్చామన్నారు.

నిర్మాణంలో ఉన్న పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారం ఇచ్చామని వివరించారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి 40 వేల కోట్లు పెండింగ్ పెట్టింది… ఈ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? అని నిలదీశారు. గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుంది..‘తెలుగు దేశం పార్టీ’ దోపిడి గురించి మాట్లాడడం..మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణలు అవాస్తవమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని తేల్చి చెప్పారు బుగ్గన.

Read more RELATED
Recommended to you

Latest news