తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్

-

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 36వేల ఈవీఎంలను సిద్ధం చేశాం. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అజ్జర్వర్లుంటారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్ కు ఒక అబ్జర్వర్ ఉంటాడు. తొలిసారి హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ సిటీజన్స్, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలు పని చేసేవారికి ఓటింగ్ ఇంటి వద్దే ఓటింగ్ అవకాశం కల్పించాం.

రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు 36వేల ఈవీఎంలు సిద్ధం చేశామని తెలిపారు. 86 శాతం ఓటర్ స్లిపుల పంపిణీ పూర్తి చేశామని ఎల్లుండి వరకు పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని.. ఈసారి కొత్తగా 51లక్షల ఓటర్ కార్డులు ముద్రించి పంపిణీ చేశామన్నారు. 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామన్నారు. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అజ్వర్వర్లు ఉన్నారని.. ప్రతీ కౌటింగ్ సెంటర్ కి ఓ అజ్వర్వర్ ను నియమించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news