చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా…!

-

ఈ వారంలోనే చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ ను ఇస్తూ హై కోర్ట్ తీర్పును ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన కేసులలో కూడా బెయిల్ ను తెచ్చుకోవడానికి చంద్రబాబు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మద్యం కేసులో చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. కాగా ఈ బెయిల్ కోసం ఇప్పటికే వాదనలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు లాయర్ నాగముత్తు ప్రివిలేజ్ ఫీజు రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏమీ లేదంటూ వాదించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని టోటల్ కాబినెట్ ఆమోదం తెల్పడం మూలంగానే ఫీజును రద్దు చేశారంటూ కోర్టుకు తెలియచేయడం జరిగింది. ఈ ఫైల్ పై రెవెన్యూ స్పెషల్ CS సంతకాలు చేశారంటూ చెప్పడం జరిగింది. ఇక ఈ బెయిల్ పిటిషన్ లో రాతపూర్వక సమర్పణలు కోసం కోర్ట్ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది.

మరి ఈ కేసులో హై కోర్ట్ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు అంతా బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news