ఇవాళ్టి నుంచి తెలంగాణలో అమిత్ షా ప్రచారం..షెడ్యూల్‌ ఇదే

-

తెలంగాణ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఈ తరుణంలో… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24, 25, 26 తేదీలలో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ 12 గంటలకు ఆర్మూర్ లో జరుగునున్న సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Amit Shah's campaign in Telangana from today
Amit Shah’s campaign in Telangana from today

మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం లో రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అంబర్పేట నియోజకవర్గం రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న సకల జనుల విజయసంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరు నియోజకవర్గం సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news