తెలంగాణలో అధికారం బీజేపీదే..! సీఎంగా ఈటెల, డిప్యూటీ సీఎంగా మందా కృష్ణ మాదిగ..?

-

    • చాప కింద నీరులా బలపడుతున్న కమలం పార్టీ
    • స్పష్టమైన మెజారిటీ ఖాయమంటున్న కమలనాథులు
    • సీఎంగా ఈటెల, డిప్యూటీ సీఎంగా మందా కృష్ణ మాదిగ..?
    • మంత్రివర్గంలో కునా శ్రీశైలం గౌడ్ కి చోటు..!

తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఎలక్షన్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లలో గ్రాఫ్‌ పెంచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఈ సారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీసీ సీఎం నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.సంక్షేమ పథకాలను పదే పదే వల్లెవేస్తూ హ్యాట్రిక్‌ విజయం కోసం అధికార భారాస ప్రయత్నాలు చేస్తోంది.కర్నాటకలో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ సారి తెలంగాణలో అధికారం తమదేనంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ సారి ఎవ్వరికైనా స్పష్టమైన మెజారిటీ కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తపరుస్తున్నారు. దక్షిణాదిలో విజయయాత్రకు తెలంగాణ రాష్ట్రాన్ని సోపానంగా మార్చుకుంటామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.బీజేపీ నేతలు ఇంత ధీమా వ్యక్తపరచడానికి కారణాలు ఏమై ఉంటాయి. ఒక్క సీటుతో మొదలైన ఆ పార్టీ ప్రస్థానం అధికారం చేజిక్కించుకునే దిశగా ఎలా సాగబోతోంది.ఈ అంశాలను ఓ సారి పరిశీలిద్దాం.

BJP-party

2018 అసెంబ్లీ ఎన్నికల్లోకేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ ఎమ్మెల్యేగా తెలిచి బీజేపీ తరపున చట్టసభలకు వెళ్ళారు.ఆ తరువాత దుబ్బాక,హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. నాగార్జున సాగర్‌,మునుగోడులో స్వత్ప తేడాతో బీజేపీ అభ్యర్ధులు ఓడినా ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది బీజేపీ. గత గ్రేటర్‌ ఎన్నికల్లోనూ బీజేపీ 48 సీట్లను గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి కేవలం రెండు డివిజన్‌లను మాత్రమే గెలుచుకుంది. పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలో సైతం ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది.

ఇలా అంచెలంచెలుగా ఓటు షేరు పెంచుకుంటున్న బీజేపీ నేతలు ఈ సారి గెలుపు తమదేనని చెప్తున్నారు.తెలంగాణ బీజేపీలో ఇంత ఆత్మవిశ్వాసం పెరగడానికి బలమైన కారణాలు చాలానే ఉన్నాయి.పాలనలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న అక్రమాలు,అన్యాయాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో బీజేపీ సక్సెస్‌ అవుతోంది.అలాగే వివిధ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇస్తున్న వాగ్దానాలు మోడీకి జైకొట్టేలా చేస్తున్నాయి.

నవంబరు 7వ తేదీన బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో బీసీలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…బీజేపీ గెలిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సిఎంగా చూస్తారు అని వ్యాఖ్యనించారు. ఈ హామీకి కట్టుబడి ఉన్నమంటూ గ్యారంటీ సంకేతాలను బీసీల్లోకి పంపించారు. బిఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆర్‌ మళ్ళీ సీఎం అవుతారు… ఆయన కాకపోతే కుమారుడు కేటిఆర్‌ ని సీఎంగా ఉండొచ్చు.మెజారిటీ పదవులన్నీఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అని ప్రధాని మోడీ చేసిన ప్రకటన బీసీల్లో ఐక్యతను తీసుకుకొచ్చింది.బీజేపీని గెలిపించుకునేందుకు అప్పటినుంచి నిశ్శబ్ధ విప్లవం మొదలైంది. అంతే కాదు నవంబరు 11వ తేదీన నిర్వహించిన మాదిగల విశ్వరూప సభతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.

గత 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ నినాదాన్ని వినిపిస్తున్నారు మాదిగ సామాజికవర్గం నేతలు. దీనిపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు మందా కృష్ణ మాదిగ.11వ తేదీన జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారు. పైగా మందా కృష్ణను తన చిన్నతమ్ముడు అంటూ అక్కున చేర్చుకోవడంతో ఆ వర్గం నుంచి హర్షం వ్యక్తమైంది.తరతరాలుగా రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా నలుగుతున్న మాదిగలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీ పెద్ద ఊరటలా అనిపించింది.

సాక్షాత్తు ప్రధానమంత్రి ఇలాంటి ప్రకటన చేయడం పట్ల మాదిగ సామాజికవర్గం నేతలు సంతోషం వ్యక్తపరిచారు.ఈ సభలో కేవలం బీజేపీ నేతలే కాదు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ సామాజికవర్గం నేతలు హాజరయ్యారు. ఎంఆర్‌పిఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మాదిగలకు ఒక కనువిప్పుగా మారింది.డిసెంబరు 4వ తేదీన శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై చర్చించి ప్రత్యేక కమిటీని వేసేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోడీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ రెండు కీలక ప్రకటనలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.బీసీ నేత ఈటెల రాజేందర్‌కు ఎంఆర్‌పిఎస్‌ నేత మందా కృష్ణ మాదిగకు రాజగయోగం ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.ఈటెల రాజేందర్‌ ఎంపిక పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. కేసీఆర్‌ కేబినెట్‌లో ఏడుమంది రెడ్లకు మంత్రి పదవులు ఉన్నాయి. అరశాతం ఉన్న వెలమలు సైతం మెజారిటీ పదవుల్లో ఉన్నారు.మరి 60 లక్షల జనాభా వున్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌ కేబినెట్‌లో ప్రాధాన్యం ఎక్కడ అని చర్చించుకుంటున్నారు.

ఇది అవమానమేనని అంటున్నారు. అలాగే ఒకే ఒక దళితుడు కొప్పుల ఈశ్వర్‌ మాత్రమే మంత్రిగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. బీజేపీ వస్తే బీసీలకు సీఎం పీఠం కట్టబెట్టడంతో పాటు ఉపముఖ్యమంత్రి పదవిలో దళితుడిని చూస్తారనే సంకేతాలు కూడా పంపారు. ఆ దళిత నేత మందా కృష్ణ మాదిగ అని కూడా పార్టీలో వినిపిస్తోంది. మందా కృష్ణను ఎమ్మెల్సీగా ఎన్నుకుని ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే మందా కృష్ణ మాదిగకు ఓ హెలికాఫ్టర్‌ను కేటాయించి ఎన్నికల ప్రచారానికి వాడేసుకుంటున్నారు కమలనాథులు.

ఉత్తరాది నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్‌ అయిన మార్వాడీలు,జైనులు,రాజ్‌పుత్‌లు,గుజరాతీలు… దాదాపుగా 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారందరూ జై మోడీ అంటున్నారు. ఉత్తరాది సెంటిమెంట్‌తో ఈ ఓట్లన్నీ బీజేపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వలన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పవన్‌ అభిమానులు, మెగా ఫ్యాన్స్‌ సైతం బీజేపీకి సపోర్ట్‌గా నిలవనున్నారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…. ఏపీలో జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు నడుస్తోంది.

ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కాబట్టి పవన్‌ కళ్యాణ్‌… నేరుగా చంద్రబాబునాయుడిని సంప్రదించి మద్ధతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బహిరంగంగా మద్ధతు ప్రకటన చేయనప్పటికీ జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో సపోర్ట్‌ చేయాలని టీడీపీ నేతల ద్వారా కేడర్‌కు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిసింది.సీమాంధ్ర ఓటర్లు ఎలాగో కాంగ్రస్‌కు ఓటు వేయరు. ఎందుకంటే తెలుగు నేలను నిర్దాక్షిణ్యంగా నిట్టనిలువునా చీల్చిన పాపం కాంగ్రెస్‌ది కాబట్టి ఎప్పటికీ సీమాంధ్రులకు కాంగ్రెస్‌ పార్టీ శత్రువే. హైద్రాబాద్‌ వంటి మహానరగంలో ఏపీ నుంచి వచ్చిన సెటిలర్‌ ల హవా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పరిణామం కూడా బీజేపికి కలిసొచ్చే అంశమనే చెప్పుకోవాలి. సీమాంధ్రులతో పాటు సాఫ్ట్‌వేర్‌లు, మేధావులు సైతం అంతర్గతంగా బీజేపీకి మద్ధతు ఇస్తున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే….తెలుగు ప్రజలు ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీకి వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన దాఖలాలు లేవు. గడిచిన 60 ఏళ్ళలో జరిగిన ఎన్నికలను గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. బీజేపీకి ప్రారంభంలో జనసంఘ్‌ అని పేరు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 1975లో జనసంఘ్‌తో పాటు ఇతర పార్టీలు ఏకమై జనతా పార్టీగా ఏర్పడింది.ఆ తరువాత విభిన్న పరిస్థితుల్లో విచ్ఛిన్నమైన ఆ పార్టీ 1982లో బీజేపీగా ఆవిర్భవించింది. అంతకుముందు వరకు దేశంలో కమ్యూనిస్టుల తరువాత ప్రధాన పార్టీ కాంగ్రెస్సే. అలాంటి పార్టీకే తెలుగు ప్రజలు 11 సార్లు అధికారమిచ్చారు. వరుసగా రెండు దఫాలు అనగా పదేళ్ళు పాలించిన ఘనత కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీలకు ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అనే అంశంలో గందరగోళం నెలకొనడంతో పాటు ప్రాధాన్యం దక్కని నేతలు ఇతర పార్టీలకు జంప్‌ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఇలాంటి అభిప్రాయమే కాంగ్రెస్‌పై ఉంది. అంతేకాకుండా హ్యాట్రిక్‌ అంశాన్ని తిరస్కరిస్తున్న తెలుగు ప్రజలు ఈసారి మాత్రం డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే భారతీయ జనతాపార్టీకి చెందిన మూడు సర్వే బృందాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టాన్ని చుట్టేస్తున్నారు. ఎప్పటికప్పడు ఓటర్ల నాడి పట్టి సమాచారాన్ని కేంద్ర కమిటీకి చేరవేస్తున్నారు. నవంబరు 22వ తేదీ వరకు జరిగిన ఈ సర్వే ప్రకారం 50కి పైగా సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. భారతీయ జనతాపార్టీకి అసలైన గ్లామర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. ఈ నెల 26,27,28 తేదీల్లో పూర్తిగా తెలంగాణలోనే ప్రధాని మకాం వేయనున్నారు. ఆయనతో పాటు ప్రధాని రేసులో ఉన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌,హోమ్‌మంత్రి అమిత్‌షా,రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అస్సాం సీఎం బిశ్వంత్‌ శర్మ వంటి ప్రముఖుల రాకతో తెలంగాణలో టోటల్‌గా సీను మారిపోయే అవకాశం ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదం, మందా కృష్ణ మాదిగ సహకారం, జనసేన మద్ధతు, తెలుగుదేశం పార్టీ కేడర్‌కు చంద్రబాబు రహస్య ఆదేశాలు.. ఇలా అన్ని కారణాలు కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రభుత్వం వచ్చాక కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న కునా శ్రీశైలం గౌడ్ కి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కి అనుకూలంగా సర్వే ఫలితాలు ఉన్నాయి. బంపర్ మెజారిటీ తో కచ్చితంగా గెలిచే సీటు ఇది. అందుకే తొలి ప్రాధాన్యం శ్రీశైలం గౌడ్ కి లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మేడిగడ్డ కుంగినట్లు బర్రెలక్క అయియాస్‌ కర్నె శిరీష ప్రభావం కూడా పనిచేసి బీఆర్‌ఎస్‌ సర్కారు కూలడం ఖాయమని అంటున్నారు. చివరలో మోడీ మకాం తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో స్పష్టమైన మార్పులు తీసుకువస్తుందనే చర్చలు నడుస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news