కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ నిరుద్యోగులు అనే వారి మాటలను నమ్మే మోసపోవద్దు అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్థీ చేసిన రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన మాట తప్పలేదు అని రాహుల్ రేవంత్ రెడ్డి జీవితంలో ఉద్యోగం చేశారా అని నిలదీశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి వెయ్యికి పైగా ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సంవత్సరానికి ₹6,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు డిసెంబర్ 4నే తన స్వయంగా అధికారులతో అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ నీ రూపొందిస్తామని యువతకు హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.