అబ్కారీ శాఖ వార్నింగ్.. తక్కువ ధరకు మద్యం అమ్మితే రూ.4 లక్షల జరిమానా

-

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటింగ్​కు రెండ్రోజుల గడువు మాత్రమే ఉండటంతో రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు మద్యం విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎమ్మార్పీ ధరకంటే తక్కువకు విక్రయించొద్దని వ్యాపారులకు చెబుతూ.. అలా విక్రయిస్తే చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలుండగా.. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేస్తారు.

మరోవైపు ఈ నెల 30తో ప్రస్తుత మద్యం విధానం గడువు ముగియనుండగా.. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త లైసెన్స్‌దారులు విక్రయాలు ప్రారంభించనున్నారు. ఆ గడువులోగా మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోని నిల్వలను ఖాళీ చేయాలంటే.. 27వ తేదీతోపాటు 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మొత్తం మద్యాన్ని వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది. అయితే తక్కువ సమయంలో తమ వద్ద ఉన్న మద్యం నిల్వలు ఖాళీ చేయడానికి వ్యాపారులు తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉన్నందున అబ్కారీ శాఖలు ఈ విషయంపై దృష్టి సారించారు. తక్కువ ధరకు విక్రయిస్తే రూ.4 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news