శభాష్: గ్రామ అభివృద్ధి కోసం ఓటింగ్ బహిష్కరించారు…!

-

గత రెండు రోజుల క్రితం రాజస్థాన్ రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఫేవరెట్ లుగా కాంగ్రెస్ మరియు బీజేపీలు పోటీ చేశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న అశోక్ గెహ్లాట్ టీం మళ్ళీ అధికారంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక బీజేపీ కూడా గెలుపు మాదే అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో జరిగిన ఒక సంచలనాన్ని మీడియా బయటపెట్టింది. రాజస్థాన్ లోని చవర్లీ గ్రామంలోని ప్రజలు అంత ఒక్కటిగా ఆలోచించి ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతిసారీ జరుగుతున్న ఎన్నికల్లో పార్టీలు అన్నీ వచ్చి హామీలు ఇవ్వడం మళ్ళీ గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడంతోనే ఈసారి ఎలాగైనా ఎన్నికలలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఈ విధంగా ఒక ఊరు మొత్తం ఐకమత్యంగా ఉండడాన్ని దేశమంతా పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇక వీరు ఎప్పటినుండో ఈ గ్రామం నుండి హై వే కు కలుపుతూ సర్వీస్ రోడ్ ను నిర్మించాలని అడుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news