బ్యాటింగ్ కిట్ కొనలేకే బౌలర్ గా సెటిల్ అయ్యాను: ఇండియా బౌలర్

-

ఇండియా తరపున బౌలర్ గా ఉన్న ముఖేష్ కుమార్ ఇప్పుడిప్పుడు జట్టులో సుస్థిరమైన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ముఖేష్ కుమార్ దేశవాళీ మ్యాచ్ లలో మరియు ఐపీఎల్ లో రాణించిన అనంతరం ఇండియా జట్టులో చోటు దక్కించుకుని పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ ఇతను ఇండియా తరపున చాలా కాలం ఆడాలంటే మాత్రమే చాలా మంచి ప్రదర్శనను చేయాల్సి ఉంటుంది. కాగా ఇటీవల ముఖేష్ కుమార్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తాను మొదటగా బ్యాటింగ్ కూడా చేసేవాడినని, కానీ ఆర్ధిక పరిస్థితుల వలన కనీసం బ్యాటింగ్ కిట్ కూడా కొనుగోలు చేయలేని స్థితిలో కేవలం బౌలింగ్ కు మాత్రమే పరిమితం అయినట్లు తెలియచేశాడు.

ఇతనికి ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి ఉంటే నేడు ఇండియ టీం అనుభవిస్తున్న ఆల్ రౌండర్ ల లేమి కొంతయినా తగ్గి ఉండేది. అందుకే ఇండియాలో క్రీడలలో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం కల్పించాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news