తెలంగాణాలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు కూడా ముగిసిపోతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారానికి ఈ రోజు మరియు రేపు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాల్లో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ఉపన్యాసాలను చేశారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మీరు గెలిపిస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ హామీ ఇచ్చాడు. గతంలో చాల ప్రాంతీయ పార్టీలు మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్కతా గా మరియు బాంబే ను ముంబై గా మార్చిన విషయం తెలిసిందే.. అదే విధంగా మా గెలుపు అనంతరం హైదరాబాద్ ను భాగ్యనగరంగా మారుస్తామన్నారు కిషన్ రెడ్డి. అసలు ఈ పేరు రావడానికి కారణం ఏమిటి ? ఎవరీ హైదర్ అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
గతంలో భాగ్యనగర్ ను నిజాం వారి కాలంలో హైదరాబాద్ గా మార్చారంటూ కిషన్ రెడ్డి తెలియచేశారు. ఇప్పుడు మళ్ళీ గత వైభవాన్ని తీసుకొచ్చే దిశగా గెలిచాక భాగ్యనగరంగా మారుస్తామన్నారు కిషన్ రెడ్డి.