పుంజుకుంటున్న పోలింగ్.. 11 గంటల వరకు 20.64 శాతం నమోదు

-

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురుగా స్వల్ప గొడవలు జరుగుతున్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గొడవలను సద్దుమణగజేస్తున్నారు. పలుచోట్ల లాఠీలకు పని చెబుతూ ఘర్షణలను అదుపు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కంట్రోల్ చేస్తున్నారు. కొన్నిచోట్ల నాన్​లోకల్స్ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్నారంటూ పలు పార్టీల నేతలు ఆందోళనకు దిగుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. కాస్త ఎండపొడి రావడంతో ఓటింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆదిలాబాద్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 30.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు, వికలాంగులు ఇలా అందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. ఈసారి ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే.. ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ నమోదయ్యేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news