BREAKING : నాగార్జునసాగర్ పై పంతం నెగ్గించుకుంది ఏపీ ప్రభుత్వం. గురువారం తెల్లవారుజామున తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి చెలరేగింది. దీంతో గురువారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా 700 మంది ఏపీ పోలీసులు డ్యామ్ మీదికి చొరబడ్డారు. ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
విషయం తెలియడంతో హుటా హుటీనా అక్కడికి చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని గతంలోనూ ఏపీ పోలీసులు ఘర్షణకు దిగారు. దీంతో నాగార్జునసాగర్ పై తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ ఏర్పడింది. అయితే.. కాసేటి క్రితమే నాగార్జునసాగర్ పై పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం…
సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల చేసింది. 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు.