సాగర్ నీటి విడుదలకు బ్రేక్.. కరెంట్ నిలిపివేసిన తెలంగాణ !

-

సాగర్ నీటి విడుదలకు బ్రేక్ పడింది. నాగార్జునసాగర్ కు చెందిన 13 గేట్లను స్వాధీనం చేసుకున్న ఏపీ పోలీసులు కుడి కాలువకు నీరు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే వారికి తెలంగాణ అధికారులు షాక్ ఇచ్చారు.

high tension at nagarjuna sagar
high tension at nagarjuna sagar

మోటార్లకు కరెంట్ సరాఫరా నిలిపివేశారు. దీంతో నీటి విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఏపీ అధికారులు కరెంట్ సరాఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇక అటు సాగర్ నీటిజలాల విడుదల అంశంపై పురంధేశ్వరి సీరియస్ కామెంట్స్ చేశారు. ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనని ఫైర్‌ అయ్యారు. సాగర్ వద్ద జరుగుతున్న ఘర్షణ ఘోరాతి ఘోరమైనదన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీ, తెలంగాణ సెంట్రల్ ఫోర్సులతో సహా ఘర్షణ పడ్డారన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ చర్య జరుగుతుందన్నారు పురంధేశ్వరి.

 

Read more RELATED
Recommended to you

Latest news