ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిన త్రివిక్రమ్…. అసలు మ్యాటర్ ఇదే …..!!

-

టాలీవుడ్ యంగ్ టైగర్ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న  విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ని వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన చేయబోయే తదుపరి సినిమా ఫిక్స్ అయినట్లు నేడు పలు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ చేస్తున్న అలవైకుంఠపురములో సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే ఈ మధ్యలో ఇటీవల ఎన్టీఆర్ ని కలిసిన త్రివిక్రమ్ ఒక మంచి స్టోరీ లైన్ వినిపించారట. అది నచ్చిన ఎన్టీఆర్, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి చెప్పండి, తరువాత సినిమా మొదలెట్టేద్దాం అని చెప్పారట. అయితే ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కావడానికి మే నెల చివరి వరకు పడుతుంది కాబట్టి, ఈ మధ్యలోనే తమ సినిమా పూర్తి స్క్రిప్ట్ తో పాటు మిగతా క్యాస్టింగ్ మొత్తాన్ని కూడా సిద్ధం చేయాలని ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్. అయితే దీనికి ఒక ముఖ్య కారణం కూడా ఉందట.

Jr Ntr next project with director trivikram
Jr Ntr next project with director trivikram

అదేమిటంటే, వాస్తవానికి ఎన్టీఆర్ కంటే ముందే, మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేద్దాం అని భావించినప్పటికీ,ఇటీవల కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధం అయిన మహేష్, ఇకపై ఇప్పట్లో ఖాళీగా ఉండరని భావించి ఎన్టీఆర్ తో చేయడానికి సిద్దమైనట్లు టాక్. అంతేకాక ఎన్టీఆర్ తో ప్రశాంత నీల్ సినిమా కూడా ఒకటి ఉన్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం నిమిత్తమే ఆ ప్రాజక్ట్ కూడా ప్రక్కన పెట్టడం జరిగిందని, ఆ విధంగా ప్రశాంత్ నీల్ స్థానంలోకి త్రివిక్రమ్ రావడం జరిగిందని మొత్తం మ్యాటర్ యొక్క సారాంశం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news