మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీ తీర ప్రాంతం జిల్లాల్లో రెడ్ అలెర్ట్

-

మిచౌంగ్​ తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్​పై తీవ్రంగా ఉండనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతోందని.. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది.

ఇవాళ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఏపీ అప్రమత్తమైంది. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం వంటి పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థుల రక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news