తెలంగాణలో నేటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. ఇక నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లను సాదించింది. కాంగ్రెస్ మద్దతుగా పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెం నుంచి గెలిచి కాంగ్రెస్ కి 65 స్థానాల్లో బలం చేకూరింది. ఇక బీఆర్ఎస్ 39, ఎంఐఎం 07, బీజేపీ 08 స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ తప్ప మరే ఇతర పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అన్ని సీట్లు రాలేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరో గంటలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది మాత్రం తేలనుంది. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రితో పాటు ఇద్దరూ డిప్యూటీ సీఎంలు, ముగ్గురు మంత్రులు ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. సీఎం ఎవరు అనేది మరికొద్ది సేపట్లోనే తేలనుంది.