ఉత్తర భారతదేశ రైతులకు పంట వ్యర్ధాలు వాడుకోవడం రాదని అంటున్నారు నిపుణులు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజు రోజుకి పెరిగిపోవడానికి ప్రధాన కారణం…
పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతులు అనుసరిస్తున్న కొన్ని విధానాలే అని ప్రభుత్వాలు సైతం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి రైతులు పంట వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా భారీగా పొగ విడుదల అవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో వరి, చెరుకు, మొక్కజొన్న వంటి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇప్పుడు వాటి సీజన్ అయిపోయింది…
దీనితో ఆ వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతున్నారు. తగలబెట్టిన తర్వాత వచ్చే బూడిద తర్వాతి పంటకు బలం చేకూరుస్తుంది అనేది కూడా వారి నమ్మకం. దీనితో వాటిని మరో ఆలోచన కూడా లేకుండా కాల్చేస్తున్నారు. దీనిపై పలువురు రైతులు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో… వరి పంట అనంతరం వచ్చే గడ్డిని ఎక్కువగా… పసు గ్రాసానికి వాడుతూ ఉంటారు. వేసవిలో పశువులకు పచ్చ గడ్డి దొరకదు కాబట్టి… ఎక్కువగా వరిగడ్డిని వినియోగిస్తూ ఉంటారు. ఇక చెరుకు వంటి పంటల వ్యర్ధాలను… ఎక్కువగా…
గృహ నిర్మాణాల కోసం వాడుతూ ఉంటారు. అలాగే పశువులకు సంబంధించిన కొన్ని నిర్మాణాల్లో చెరుకు వ్యర్ధాలు ఉపయోగపడుతూ ఉంటాయి. పసు గ్రాసంగా కూడా పంట వ్యర్ధాలను వినియోగించుకుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడో గాని పంట వ్యర్ధాలను రైతులు తగలబెట్టరు. ఏదొక రూపంలో వాటిని వినియోగిస్తూ ఉంటారు. దీనిపై ప్రకృతి ప్రేమికులు పలు సలహాలు ఇస్తున్నారు. పంట వ్యర్ధాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దానిపై ఉత్తరభారత దేశ రైతులకు శిక్షణ ఇస్తే మంచిదని, తద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.