జాన్సన్ అనే వ్యక్తి కుమార్తె (10) త్వరలో రానున్న క్రిస్మస్ పండుగ కోసం తనకు పలు గిఫ్టులు కొనివ్వాలని చెబుతూ ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి జాన్సన్‌కు ఇచ్చింది. అందులో సాధారణంగా అందరు పిల్లలు అడిగినట్లు కాకుండా.. ఐఫోన్ 11, మాక్‌బుక్ ఎయిర్ తదితర ఖరీదైన వస్తువులు ఉండడం విశేషం.
సాధారణంగా 10 సంవత్సరాల వయస్సు అంటే.. ఆ ఏజ్‌లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు ఏమేం వస్తువులు కొనివ్వమంటారు చెప్పండి..? దుస్తులు, ఆట వస్తువులు, తిను బండారాలు.. అవేగా.. ఎవరైనా అవే కొనివ్వమని అడుగుతారు. కానీ ఆ పాప మాత్రం అలా కాదు. తన తండ్రికి రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు వస్తువులను బహుమతులుగా కొనివ్వాలని ఏకంగా ఓ లిస్టే క్రియేట్ చేసింది. అయితే ఆ లిస్ట్‌లో ఉన్న వస్తువులను చూసి ఆ తండ్రి షాకయ్యాడు. ఈ క్రమంలో ఆ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జాన్సన్ అనే వ్యక్తి కుమార్తె (10) త్వరలో రానున్న క్రిస్మస్ పండుగ కోసం తనకు పలు గిఫ్టులు కొనివ్వాలని చెబుతూ ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి జాన్సన్‌కు ఇచ్చింది. అందులో సాధారణంగా అందరు పిల్లలు అడిగినట్లు కాకుండా.. ఐఫోన్ 11, మాక్‌బుక్ ఎయిర్ తదితర ఖరీదైన వస్తువులు ఉండడం విశేషం. అలాగే మరో 4వేల డాలర్ల నగదును కూడా తనకు పండుగకు బహుమతిగా ఇవ్వాలని ఆ బాలిక తన తండ్రికి ఆ లిస్ట్‌లో తెలిపింది. దీంతో జాన్సన్ ఆ లిస్ట్‌ను ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే దానికి 12 లక్షల లైకులు రాగా, ఆ ట్వీట్‌ను 23వేల మంది రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆ లిస్ట్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు..!
My 10 year old daughter must be out of her mind with this Christmas list ??? pic.twitter.com/Qqsje79rda
— @A_Johnson412 (@a_johnson412) November 13, 2019