తుఫాన్ బాధితులకు రేషన్ పంపిణీ చేయండని ఆదేశించారు ఏపీ సీఎం జగన్. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని పేర్కొన్నారు.
సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని.. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లో పరిహారం అందించాలని వెల్లడించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధ ద్వారా రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఏపీ సీఎం జగన్. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేయాల న్నారు.