కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద ఆస్పత్రి ప్రకటన చేసింది. కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల అయింది. ఈ మేరకు కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది యశోద ఆస్పత్రి వైద్యుల బృందం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసంలో బాత్రూంలో కాలి జారి పడిపోవడంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు వైద్యులు.
హిప్ సిటీ స్కాన్ నిర్వహించినా అనంతరం… ఎడమ హిప్ ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు…దీంతో హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు నిర్ధారణకు వచ్చారన్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల వైద్యుల బృందం కెసిఆర్ ఆరోగ్యం పై పర్యవేక్షిస్తుంది…కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వివరించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామనియశోద ఆస్పత్రి వర్గాలు ప్రకటన చేసాయి.