తుఫాను బాధితులకు రూ.2500 సాయం చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద పంట నష్టంపై సీఎం జగన్ కు వివరించారు అధికారులు. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తుఫాను బాధితులకు రూ.2500 సాయం చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు.
తుఫాన్ బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం.. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇస్తామన్నారు సీఎం జగన్. ఐదు రోజుల్లో వర్షాలు బాగా కురిశాయి..వరుసగా పడిన వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారన్నారు. 92 రిలీఫ్ కేంద్రాలను పెట్టడం జరిగిందని చెప్పారు సీఎం జగన్.