తుఫాన్‌ వల్ల నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.50 వేలు ఇవ్వాలి – పురంధేశ్వరి

-

తుఫాన్‌ వల్ల నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఏలూరు పూళ్ళ గ్రామంలో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించిన బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి..నీట మునిగిన వరి చేలల్లో దిగి రైతులను పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ…. వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి..

purandeswari

కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు..రైతుల పట్ల ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని ఆగ్రహించారు.రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారని మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50 వేలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తడిచిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలి..రైతులకు గోనె సంచులు సైతం ఇవ్వలేని పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చినా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పరిస్థితి ఉందని చెప్పారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news