TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి జనవరి 5 వరకు ఆధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఆధ్యాయనోత్సవం ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్టిగానం చేస్తారు. ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు.. 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు.
నిన్న ఒక్క రోజే టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 73,091 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 23,246 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే..నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లుగా నమోదు అయింది.