అంగన్ వాడిలను సీఎం జగన్ మోసం చేశారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. అంగన్ వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంపూర్న మద్దతు ఇస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. పనికి తగిన వేతనం ఇస్తానని చెప్పి సీఎం జగన్ అంగన్ వాడీలను మోసం చేశారని.. వారిపై విపరీతమైన పని ఒత్తిడిని పెంచారని విమర్శించారు.
అంగన్ వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని.. గ్రాట్యూటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలి. పని భారం పెంచారు.. కానీ జీతాలను పెంచడం లేదు. నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్ లలో విధులకు సంబంధించిన వివరాలు అప్డేట్ చేయమంటే ెలా చేయాలి? జగనన్న ఇచ్చిన యాప్ మాత్రమే ఆ ఫోన్లలో ఉంటుంది. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామన్నారు. ఇప్పుడేమో మాట మార్చారని రాష్ట్రం ప్రభుత్వం పై అంగన్ వాడీలు మండిపడుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు లక్ష మంది వరకు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలున్నారు.