Lookback 2023 : మహిళల పరిస్థితి ఈ ఏడాది ఎలా ఉంది..?

-

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, అన్ని పరిస్థితులను హ్యాడింల్‌ చేయాలి అని అందరూ అంటారు. కానీ వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయా.? 2023లో కొన్ని రంగాల్లో మహిళలు తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. కానీ గ్రౌండ్‌ లెవల్లో పరిస్థితి వేరుగా ఉంది. ఈ సంవత్సరం మహిళలపై దాడులు 4 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక చెప్తుంది. గత మూడేళ్లలో 13.13 లక్షల మంది మహిళలు అదృశ్యం అయ్యారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కసారి 2023లో మహిళల పరిస్థితి ఎలా ఉందో చూద్దామా..!

ఫోర్బ్‌ 2023 జాబితాలో ఎంత మంది మహిళలు ఉన్నారు..

గత వారం విడుదల చేసిన ఫోర్బ్స్ 2023లో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు వ్యాపారవేత్తలు రోష్నీ నాడార్ మల్హోత్రా, సోమా మోండల్ మరియు కిరణ్ మజుందార్-షా ఉన్నారు. బెల్జియన్ రాజనీతిజ్ఞురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, కమలా హారిస్, బియాన్స్ మరియు టేలర్ స్విఫ్ట్ ఈ జాబితాలోని ఇతర ప్రముఖ వ్యక్తులలో కొందరు. గతేడాది జాబితాలో 64వ స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఈ ఏడాది 32వ స్థానంలో నిలిచారు. 60వ ర్యాంక్‌లో ఉన్న HCL కార్పొరేషన్స్ CEO రోష్ని నాడార్ మల్హోత్రాతో కలిసి; SAIL ఛైర్‌పర్సన్ సోమ మొండల్ (70వ స్థానం) మరియు బయోకాన్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా 76వ స్థానంలో నిలిచారు.

ఉమెన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎలా ఉంది..?

మంత్రిత్వ శాఖ 2023 అక్టోబర్ 9న విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 2022-23 ప్రకారం… దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 2023లో గణనీయంగా 4.2 శాతం పెరిగి 37.0% కి చేరుకుంది.

ఈ ఏడాది జెండర్‌ ఇక్వాలిటీ ఇండియాలో ఎంత పెరిగింది..?

లింగ వ్యత్యాస నివేదిక 2023లో భారతదేశం ర్యాంక్… నివేదిక యొక్క 2023 ఎడిషన్‌లో 146 దేశాలలో 135వ స్థానం నుంచి (2022లో) ఈ ఏడాది 127వ స్థానానికి ఎగబాకుతున్న భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది.

గృహహింస ఎంత ఉంది..?

భారతదేశంలో గృహహింస కేసులకు సంబంధించి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో గృహహింస కేసుల జాబితాలో 50.4% తెలంగాణ రెండవ స్థానంలో ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. 75% గృహహింస కేసులతో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆపై తెలంగాణ రాష్ట్రం 50.4 శాతం గృహింస కేసులతో రెండవ స్థానంలో, 48.9%తో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచాయి. ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులలో మూడో వంతు దాడులు ఆమె భర్త, బంధువులు చేస్తున్న దాడులే కావడం గమనార్హం.

జనాభాలో స్త్రీల వాటా ఎంత..?

భారతదేశంలో పురుషుల జనాభా 717,100,970 (717.10 మిలియన్లు) మరియు 662,903,415 స్త్రీలు (662.90 మిలియన్లు). మొత్తం జనాభాలో స్త్రీలు 48.04 శాతం కాగా, పురుషులు 51.96 శాతంగా ఉన్నారు. దేశంలో అత్యధిక పురుషుల జనాభా 54.20 మిలియన్లతో ఉంది. భారతదేశంలో, లింగ నిష్పత్తి ఆసియాతో పోలిస్తే 927 కంటే తక్కువగా ఉంది

స్పోర్ట్‌లో మహిళల వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరగాలి.. మహిళలపై నేరాలు కూడా ఈ సంవత్సరం 4శాతం పెరిగాయి. మహిళపై దాడులు చేసే వాళ్లలో భర్త, కుటుంబసభ్యులే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్ల అంటే ఆడుకుని పడేసే వస్తువు అనే ధోరణి నేటి సమాజంలో చాలా మందికి ఉంది. ఈ ఆలోచనలో మార్పు రావాలి. ముట్టుకోవాలంటే ముచ్చెమటలు పట్టేలా మహిళలు వృద్ధి చెందాలి. ఇలా జరగాలంటే.. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలి. మొత్తానికి స్త్రీలలో అభివృద్ధి ఎలా ఉందో.. వారి మీద జరిగే దాడుల సంఖ్య కూడా అలానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news