హరీశ్ శంకర్- రవితేజ మూవీలో క్యాడ్బరీ బ్యూటీ

-

మాస్ మహారాజ రవితేజ ఊర మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అని ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు. అయితే తాజాగా చిత్రబృందం ఆ హీరోయిన్ పేరును ప్రకటించింది. తాజాగా ఆ భామ ఫొటోను షేర్ చేసింది. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే రవితేజతో ఈ సినిమాలో జతకడుతోంది. అయితే ఈ అమ్మాయి ఎవరా అని ప్రేక్షకులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. అలా వెతికిన వారికి ఈ భామ క్యాడ్బరీ బొమ్మ అని తెలిసిపోయింది. మరి భ్యాగ్యశ్రీ బోర్సే గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా?

మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‌గా ఫేమ్‌ సొంతం చేసుకుని.. పలు బ్రాండ్స్‌ కోసం వాణిజ్య ప్రకటనకర్తగానూ వ్యవహరించింది. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ సిల్క్‌ చాక్లెట్‌ యాడ్‌ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘యారియాన్ 2’ అనే బాలీవుడ్‌ చిత్రంతో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె రాజ్యలక్ష్మి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ – రవితేజ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news