వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దూసుకుపోతోంది.రోజురోజుకీ ప్రజలకు చేరువ అవుతూ మళ్ళీ ఏపీలో వైసీపీ గెలుపు దిశగా అనుకూల పవనాలు వస్తున్నాయి. అయితే దీనిని నిలువరించడానికి నానా తంటాలు పడుతున్నారు మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.ఎన్ని పోస్టింగ్‌లు పెట్టినా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఓ వినూత్న కార్యక్రమానికి టీడీపీ అధినేత శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం అనగా ఐటిడిపి కి చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇంతకు ముందు ఒక్కో సోషల్ మీడియా పోస్టుకు ఇచ్చే దానికన్నా ఎక్కువ రేటు ఇస్తామని అఫర్ ఇచ్చారు.ఒక పోస్టుకు రూ. వంద ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇకముందు ట్విట్టర్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెంచాలని ఆదేశించారు.అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్టింగ్‌ల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడమే లక్ష్యంగా ఇలంఆటి కొత్త కొత్త స్కీమ్‌లను తెస్తున్నారు చంద్రబాబు.వెనకా ముందూ చూడొద్దని, ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పని చేయాలనీ ఆదేశించినట్లు తెలిసింది.
రెడ్లను రౌడీలుగాను.. సీమ ప్రజలు,సీమ నాయకులను గూండాలుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయాలని అయన సూచించినట్లు సమాచారం. ఆంధ్రాలో అరాచకాన్ని ప్రోత్సహించి హింసను ప్రేరేపించేందుకు సీమ నుంచి ముఠాలు దిగాయని చెప్తూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో ఉత్సాహంగా ప్రచారం చేయాలనీ చెప్పారట. ఎన్నికలకు కేవలం వందరోజులు సమయం మాత్రమే ఉన్నందున అత్యంత వేగంగా ఈ దుష్ప్రచారం చేయాలనీ అయన సూచించినట్లు తెలుస్తోంది. అటు అనుకూలమైన మీడియా, ఛానెళ్లలో ఎలాగూ సొంత కథనాలు వస్తున్నాయి.అయితే వాటికి విశ్వసనీయత తగ్గిన నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఇలా ప్రచారం చేయాలనీ అయన వారిని ఉత్సాహపరిచినట్లు తెలిసింది.టీడీపీకి జనాదరణ పెంచుకోవడం కోసం ఇతర పార్టీల పట్ల బురద చల్లడం చంద్రబాబుకి అలవాటుగా మారిందని పలువురు మండిపతున్నారు.