ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నట్లు ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ప్రచారంలో చెబితే ఫ్రీగా ఇవ్వాలా అని సిద్ధరామయ్య ప్రశ్నించినట్లు సర్క్యులేట్ అవుతున్న వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రీపోస్టు చేసి తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా కేటీఆర్కు కౌంటర్ ఇస్తూ ఇందుకే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ఫేక్ న్యూస్, ఎడిటెడ్ వీడియో, మార్ఫింగ్ వీడియోలకు కూడా తేడా తెలియదని, నిజానిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. ఓవైపు బీజేపీ ఇలా ఫేక్ వీడియోలు ఎడిట్ చేస్తుంటే వాటిని బీఆర్ఎస్ నెట్టింట వైరల్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని ఇప్పుడు ప్రజలకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అంటూ సిద్ధరామయ్య ట్వీట్లో పేర్కొన్నారు.
Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections?
Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP.
If you are… https://t.co/Ey5y9K3fLd
— Siddaramaiah (@siddaramaiah) December 19, 2023