కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ చార్జీలలో రాయితీ ఇవ్వాలని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. కళాకారులు, సీనియర్ సిటీజన్లకు కీలకమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తూ.. ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్ ను పున:పరిశీలించాలని రైల్వే మంత్రిని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కోరారు.
ప్రధానంగా నృత్యం, సంగీతం, నాటక ప్రదర్శనలు చేసే వారు గతంలో 50-75 శాతం రాయితీని పొందారు అని గుర్తు చేశారు. ఇందులో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ లలో 75 శాతం రాయితీ, 1వ తరగతికి 50 శాతం రాయితీ, ఏసీ చైర్ కారు, 3ఏసీ, 2ఏసీ ఉన్నాయని గుర్తు చేశారు. రాబోయే 26 జనవరి వేడుకలు, ఇతర ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రదర్శనలున్న నేపథ్యంలో ఈ రాయితీలను పునరుద్ధరించడం చాలా కీలకమని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు సూచించారు.