హామీలు అమలు చేయలేకపోతే..కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి KTR. గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు..ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..?కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..??అని ప్రశ్నించారు.
ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నరా..? గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నరా..? అం ఐ నిలదీశారు. శ్వేత పత్రాల తమాషాలు..పవర్ పాయింట్ షోలు దేనికోసం..? అని మండిపడ్డారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించిఅధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా..? అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి KTR. తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం..తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని.. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా..! అంటూ ప్రశ్నించారు కేటీఆర్. దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక… ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం అని పేర్కొన్నారు మాజీ మంత్రి KTR.