వైసీపీలో టికెట్ దక్కని వారు.. కాంగ్రెస్ కు వెళతారు – వైసీపీ ఎంపీ

-

కుటుంబ వారసత్వాన్ని చాటుకోవాలని ఆరాటపడిన జగన్ మోహన్ రెడ్డికి కొన్నాళ్లు ఓపిక పట్టమని, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సూచించినప్పటికీ… ఆవేశంతో బాలుడు పార్టీ ఏర్పాటు చేశారని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. ఒకసారి ఓడిపోయి, రెండవసారి ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టారని, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే అత్యధికంగా జగన్ మోహన్ రెడ్డి గారి వెంట కలిసి నడిచారని, దీనితో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా వైకాపా వైపు షిఫ్ట్ అయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాలో చేరిన వారు, రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే తిరిగి మళ్ళీ అదే పార్టీలో చేరనున్నారని బాంబ్ పేల్చారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా దృష్టి సారించిందని, 2024లో అవకాశాలు లేకపోయినప్పటికీ, 2029లో అవకాశం లభిస్తుందని ఆశాభావంతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసిందని అన్నారు. 2029 నాటికి వైకాపా ఉంటుందో, ఉండదోననే అనుమానం చాలా మందిలో ఉందని, కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయడం వల్ల, రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను దారుణంగా ఓడించనున్నారని, వైకాపా అభ్యర్థులు ఎలాగో ఓడిపోవడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైకాపా ఓటు బ్యాంకును గట్టిగానే చీల్చనున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news