సలార్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల…

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ పార్ట్ వన్ : సీజ్ ఫైర్ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదల అయింది.ప్రతి గాథలో రాక్షసుడు’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇటీవల విడుదలైనటువంటి ట్రైలర్స్ మరియు సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా బుక్ మై షో ఆప్ క్రాష్ అయ్యింది .దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై క్రేజ్ ఎంతుందో తెలుస్తుంది. నిన్నటి వరకు 30 లక్షల పైగా టికెట్లు అమ్ముడు అయ్యాయని నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది .అలాగే మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి కుమారి, శ్రీయ రెడ్డి తదితర నటులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి రవి బస్రుర్ సంగీతాన్ని అందిస్తుండగా భువన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news