చంద్రబాబు, పవన్, లోకేశ్ ఊడిపోయిన బకెట్ గాళ్లు : కొడాలి నాని

-

యువగళం నవశకం బహిరంగ సభపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నవశకం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల వ్యవహారం చూస్తుంటే అడుగు ఊడిపోయిన బకెట్ గాళ్లంతా నిన్న చేసింది. పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమేనని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధభేరి మొదలుపెట్టారు అని చెప్పుకొచ్చారు.

12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కూకటి వేళ్ళతో పేకలించారని అన్నారు. అంతేకాదు చంద్రబాబును భూస్థాపితం చేశారని, పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తుచిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడు అని చెప్పకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడులు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టారని ఏం చేసినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరు అని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని కొడాలి నాని మండిపడ్డాడు.30 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ కాలేదా అని నిలదీశారు. లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా, పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోళీలు ఆడుకున్నాడా అని నిలదీశారు. తండ్రి, కొడుకు, పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. బోరా గాలంతా మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news